దేశ పౌరులంతా కరోనాను తరిమికొట్టేందుకు రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని విద్యుత్ లైట్లు అన్నీ ఆఫ్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని దేశప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ స్పందించారు. హిందూ ధర్మాన్ని, సాంసృతిని అవమానించేలా ఓవైసీ మాట్లాడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. శనివారం నాడు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.
కరోనాపై పోరాటానికి ప్రధాని మోదీ దీపం వెలిగించమంటే దానిని కూడా మతకోణంతో చూడటం అవివేకమన్నారు.వైద్యులకు కృతజ్ఞత తెలపడం ఓవైసీకి తెలియదని.. ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలని ఆమె హితువు పలికారు. దేశ ఐక్యత కోసం ప్రధాని మోదీ పిలుపునిచ్చారని అరుణ గుర్తు చేశారు. వైద్యులకు మనోధైర్యం అందించే కార్యక్రమంలో ప్రతి ఒక్క భారతీయుడు పాల్గొనాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.

