బాలీవుడ్ ‘పింక్’ సినిమాని తెలుగులో రిమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కున్న 40వ సినిమా ఇది కావడం మరో విశేషం. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో చారిత్రాత్మక చిత్రం చేయనున్నాడనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ మంచి మిత్రులు అనే సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు భారీ విజయాలు సాధించగా, అజ్ఞాతవాసి చిత్రం నిరాశపరచింది. ప్రస్తుతం త్రివిక్రమ్ .. అల వైకుంఠపురములో చిత్రంతో బిజీగా ఉండగా, పవన్ కళ్యాణ్ రాజకీయాలతో సమయం గడుపుతున్నారు. అయితే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు రీసెంట్‌గా కలిసారు. వీరి కలయికపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుంది. పవన్‌తో సినిమా చేసే విషయంలో త్రివిక్రమ్ కలిసారా లేదంటే ఫ్రెండ్షిప్‌లో భాగంగా కలిసారా అనే దానిపై క్లారిటీ లేదు.
previous post

