*ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన దేవినేని ఉమ
*పెరిగిన ఛార్జీలపై ప్రయాణికులతో ఆరా..
*గొల్లపూడి టు మైలవరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం..
వైసిపి ప్రభుత్వం పండగలపూట ప్రజలపై భారం మోపడం దారుణమనిటీడీపీ నాయకుడు దేవినేని ఉమా మహేశ్వరరావు అమరావతిలోని గొల్లపూడి నుండి మైలవరం వరకు ఆర్టీసీ బస్సులో సామాన్య ప్రజలతో కలిసి ప్రయాణిస్తూ నిరసన తెలిపారు.
ఈ క్రమంలో బస్సులోని ప్రజలతో మాట్లాడి పెరిగిన ఛార్జీలపై గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ తుగ్లక్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. చంద్రబాబు హయాంలో పండుగలకు కానుకలు ఇస్తే… వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ బాదుడు బాదేస్తున్నారన్నారు.
ఉగాది పండుగ వేళ విద్యుత్ ఛార్జీలను పెంచిన సర్కారు…ఇవాళ గుడ్ ఫ్రైడేకి ఆర్టీసీ టికెట్ ధరలు పెంచిందంటూ సెటైర్లు వేశారు. ఈ మోసపూరిత సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు. పెంచిన ధరలు తగ్గించే వరకు టీడీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని దేవినేని ఉమ స్పష్టం చేసారు.


సచివాలయ వ్యవస్థ వల్లే అనేక సమస్యలు: పురందేశ్వరి