telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మాజీ మంత్రి దేవినేని ఉమా స‌హా తెదేపా నేత‌లు అరెస్ట్‌..

*గుంటూరు సీఐడీ ఆఫీస్ వ‌ద్ద హైటెన్ష‌న్‌

*అశోక్‌బాబుపై ధ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తున్నారు…
*గుంటూరులో దేవినేని స‌హా తెదేపా నేత‌లు అరెస్ట్‌..
* కావాలనే ఎమ్మెల్సీ అశోక్ బాబుపై అక్రమ కేసులు..

గుంటూరులోని సీఐడీ ఆఫీస్ వ‌ద్ద హైటెన్ష‌న్ నెల‌కొంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.

తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబును అర్థ‌రాత్రి అరెస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో అశోక్‌బాబును పరామర్శించేందుకు సీఐడీ ఆఫీస్‌కు వచ్చిన దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. అశోక్‌బాబును కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు తీరుపై దేవినేని ఉమా తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో అక్క‌డ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దేవినేని ఉమా సహా టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, పిల్లి మాణిక్యాలరావు, సుఖవాసి, కనపర్తిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గుంటూరు నగరంపాలెం జైలుకు త‌ర‌లించారు

కాగా ఎమ్మెల్సీ అశోక్ బాబు ను అరెస్ట్ చేసి రాత్రంతా థర్డ్ డిగ్రీ ఉపయోగించారని వారిపై దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ బాబును కొట్టే అధికారం సిఐడి పోలీసులు ఎవరు ఇచ్చారని నిలదీశారు. సీఐడీ అధికారులు కావాలనే ఎమ్మెల్సీ అశోక్ బాబుపై అక్రమ కేసులు పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. అశోక్‌బాబు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే ముందస్తు బెయిల్ తీసుకోలేదన్నారు. శుక్రవారం నాడు అరెస్టులు చేసి ఈ ప్రభుత్వం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దేవినేని ఉమ మండిపడ్డారు.

Related posts