telugu navyamedia
క్రీడలు వార్తలు

లంక పర్యటనలో శాంసన్ ను కెప్టెన్ చేయాలి : పాక్ క్రికెటర్

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం ఓ భారత జట్టు యూకే పర్యటనకు వెళ్తుండగా.. మరోవైపు అదే సమయంలో మరో జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వడంతో పాటు రెండో జట్టుకు కోచ్‌గా భారత మాజీ క్రికెటర్, ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించింది. అయితే శ్రీలంక టూర్‌కు వెళ్లే జట్టు టీమ్ ఇంకా ఎంపిక చేయలేదు. ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ ఆటగాళ్లతో పాటు భారత్-ఏ తరఫున రాణిస్తున్న ప్లేయర్లకు ఈ టీమ్‌లో చోటు దక్కనుంది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఈ జట్టు సారథ్య బాధ్యతలు దక్కనున్నాయి. ఈ లంక పర్యటనలో టీమిండియాను విధ్వంసకర బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ నడిపిస్తే బాగుంటుందని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. టీమిండియా భవిష్యత్తుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా టీమిండియా బీ టీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘శ్రీలంక పర్యటనకు వెళ్లే రెండో భారత జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పృథ్వీ, సంజూ శాంసన్‌కు జట్టు బాధ్యతలు ఇవ్వకపోవచ్చు. అయితే నా అభిప్రాయం ప్రకారం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సంజూ శాంసన్‌ను కెప్టెన్ చేస్తే బాగుంటుంది. విరాట్ కోహ్లీ సారథిగా తప్పుకునే సమయానికి మరో కెప్టెన్‌ను సిద్దం చేసినట్లు ఉంటుంది. కాబట్టి నేను సంజూ శాంసన్ కెప్టెన్ అయితే బాగుటుందనుకుంటున్నా అని తెలిపాడు.

Related posts