telugu navyamedia
క్రీడలు వార్తలు

సన్‌రైజర్స్ తరపున డేవిడ్ వార్నర్ కు ఇదే ఆఖరి సీజన్…

సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్‌పై వేటు వేసి కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వడం సరికాదని ఈ మాజీ పేసర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న వార్నర్‌ను జట్టు నుంచి తప్పించడం వింతగా అనిపించిందన్నాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌తో మాట్లాడుతూ.. వార్నర్ వేటుపై స్పందించిన ఈ సఫారీ మాజీ పేసర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘యాజమాన్య నిర్ణయాన్ని డేవిడ్‌ ప్రశ్నించాడో లేదో నాకు తెలియదు. అయితే, మనీష్‌ పాండే విషయంలో మాత్రం తాను ఎలాంటి డెసిషన్‌ తీసుకోలేదని చెప్పాడు. కొన్నిసార్లు మేనేజ్‌మెంట్‌కు ఇలాంటి మాటలు రుచించకపోవచ్చు. ఒక కెప్టెన్‌గా కొన్ని తప్పనిసరి బాధ్యతలు ఉంటాయి. ఎవరు తుదిజట్టులో ఉంటారు, ఎవరిని పక్కన పెట్టాలి అన్న అంశాలపై స్పష్టత ఉండాలి. అయితే, ఒక్కోసారి పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు. మొత్తానికి తెరవెనుక ఏదో జరుగుతోందనే విషయం మాత్రం స్పష్టంగా అర్థం అవుతోంది.’డేల్ స్టెయిన్‌ చెప్పుకొచ్చాడు. సన్‌రైజర్స్ యాజమాన్యం వ్యవహారశైలి చూస్తుంటే డేవిడ్‌ వార్నర్‌ ఇక ఆ జట్టుకు ఆడే పరిస్థితి కనబడటం లేదని పేర్కొన్నాడు.

Related posts