విద్యుత్ బిల్లును చూసి ఓ వినియోగదారుడు షాక్ అయ్యాడు. రెండు నెలలకు గాను తనకొచ్చిన విద్యుత్ బిల్లుతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. తీరా బిల్లు తీసుకొని విద్యుత్ శాఖ అధికారుల వద్దకు వెళ్లి చూపిస్తే వారు కూడా విస్తుపోయారు. ఓ చిన్న ఇంటికి ఏకంగా రూ. 6 లక్షలకు పైగా వచ్చిన బిల్లును చూసిన అధికారులు కూడా షాకయ్యారు. తెలంగాణలోని పెదపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పట్టణంలో సంజయ్ నగర్ లో నివాసముంటున్న మాస రాజయ్య ఇంటికి అమర్చిన విద్యుత్ మీటరులో సాంకేతిక సమస్య తలెత్తింది. అధికారులు ఆగస్టులో సమస్యను గుర్తించినప్పటికీ దానిని మరమ్మతు మాత్రం చేయలేదు. ఈ నెలలో అలాగే దాని నుంచి రీడింగ్ నమోదు చేసి 6,07,414 రూపాయల బిల్లను రాజయ్య చేతిలో పెట్టారు. బిల్లు చూసిన రాజయ్య గుండె గుభేల్మంది. వెంటనే దానిని తీసుకెళ్లి అధికారులకు చూపించాడు. కాగా, విద్యుత్ మీటరులో లోపం ఉన్నట్టు రాజయ్య నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు.


ప్రజల తరుపున ప్రశ్నిస్తే కేసులు..టీఆర్ఎస్ పై జగ్గారెడ్డి ఫైర్!