ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలు కొనసాగుతుండడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
ఈ మేరకు డీజీపీ హరీశ్ కుమార్, సీఎస్ జవహార్ రెడ్డికి సమన్లు జారీ చేసింది.
ఈసీ ఆదేశాల నేపథ్యంలో సీఎస్, డీజీపీ నేడు ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల సంఘం ముందు వ్యక్తిగతంగా హాజరైన జవహర్ రెడ్డి, హరీశ్ కుమార్ గుప్తా రాష్ట్రంలో పరిస్థితులపై వివరణ ఇచ్చారు.
ఏపీలో పోలింగ్ సందర్భంగా, పోలింగ్ అనంతరం హింసను అరికట్టడంలో విఫలమయ్యారంటూ పోలీసులపై తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే.
సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహార సరళిపై ముందు నుంచే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీలను ఈసీ ఆదేశించడం ఏపీలో పరిస్థితికి అద్దం పడుతోంది.

