*తిరుపతిలో ఉద్రిక్తత..
*సర్వదర్శన టోకెన్ల కోసం బారులు తీరిన భక్తులు..
*శ్రీవారి భక్తులు తోపులాట..ముగ్గురు భక్తులుగాయాలు..
*రూయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్ల కోసం భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో కొందరు భక్తులకు గాయాలు అయ్యాయి. గాయాలు పాలైన వారిని తిరుపతిలో రూయా ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు.
తిరుపతిలోని మూడు చోట్ల టిటిడి భక్తులకు సర్వదర్శనం టికెట్లను జారీ చేసింది. గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల దగ్గర టోకెన్లను జారీ చేశారు.
నిన్న అర్ధరాత్రి నుండి స్వామి వారి సర్వదర్శనం టోకెన్ కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్ లో గంటల తరబడి వేచి ఉన్నారు.
గత రెండు రోజులుగా సర్వదర్శనం టికెట్ల జారీని నిలిపివేశారు. దీంతో ఇవాళ్టి నుండి సర్వదర్శనం టికెట్లను జారీ చేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో టికెట్ల కోసం పోటీ పడ్డారు. అయితే భక్తుల మధ్య తోపులాట జరగడంతో పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు.