telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అమరావతి రైతులపై అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ నేడు, రేపు సిపిఐ నిరసనలు…

అమరావతి రైతులపై అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ నిరసనలు చెప్పటనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. మూడు రోజుల అమరావతి జేఏసీ ఉద్యమానికి సిపిఐ మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అమరావతి రాజధాని ప్రాంతం కృష్ణాయపాలెం రైతుల పై పోలీసులు అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి, జైలుకు పంపడం దుర్మార్గం అని చెప్పుకోచ్చారు. కరడుగట్టిన నేరస్థుల్లా రైతులకు బేడీలు వేసి తిప్పిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చరిత్రకెక్కింది అని తెలిపారు. ఫిర్యాదు దారుడే కేసు ఉపసంహరించుకుంటానన్నా డి.ఎస్.పి మొండిగా వ్యవహరించారు అని అన్నారు. తక్షణమే అమరావతి రైతులు, మహిళల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి అని రామకృష్ణ డిమాండ్ చేసారు. అయితే రాజధాని అమరావతి ఉద్యమం 300 రోజుల పూర్తి చేసుకున్న సమయంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద అమరావతికి మద్దతుగా నిర్వహించిన నిరసన శిబిరంలో సి.పి.ఐ ప్రధాన కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో అమరావతి, ప్రత్యేక హోదా మద్దతు ప్రకటించిన వారికే తమ మద్దతు పలుకుతాం అని స్పష్టం చేసారు.

Related posts