బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో 420 ప్రధాని ఎవరన్నా ఉన్నారంటే.. అది మోడీనేనని.. మోడీ మాటలు నమ్మలేమన్నారు. గాంధీని చంపిన వాళ్లే… ఇవాళ ఆయనకు నివాళి అర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబ్రీ మజీద్ కూలగొట్టబోమని… బీజేపీ నాయకులు వెళ్లి కూలగొట్టారని… అలాగే రైతులు ఎర్రకోట వద్దకు వెళ్లబోమని..అక్కడికి వెళ్లి హింసను సృష్టించారని మండిపడ్డారు. ఎర్రకోటను కాపాడుకోలేని వాళ్ళు.. దేశాన్ని ఏం కాపాడతారని? ఫైర్ అయ్యారు నారాయణ. కేసీఆర్ ని జైల్లో పెడతాం అనే మాటలకు భయపడి రాష్ట్రపతి ప్రసంగానికి వెళ్లారని.. బీజేపీకి భయపడి ప్రతిపక్షాలతో కలిసి రాలేదని ఆరోపించారు. ప్రజలకు భయపడరు… కానీ బీజేపీకి కేసీఆర్ భయపడుతున్నారని..ఇక టీఆర్ఎస్ డ్రామాలు ఆపాలని ఫైర్ అయ్యారు. Rss..బీజేపీలకు వ్యతిరేకంగా సైదాంతిక పోరాటం చేస్తామని.. కేరళ, బెంగాల్ లలో ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. కేరళలో మరింత బలంగా ఫ్రెంట్ ఉందని.. గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందన్నారు. అస్సాం, పుదుచ్చేరిలో కూడా గట్టిగా ఫైట్ చేస్తామన్నారు.


తెలంగాణ బడ్జెట్లో వాస్తవాలు కనిపించడం లేదు: విజయశాంతి