telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కౌలు రైతుల సంక్షేమానికి కొత్త కౌలుచట్టం తీసుకురావాలని చంద్రబాబు నాయుడు కు విజ్ఞప్తి చేసిన సీపీఐ నేతల

రాష్ట్రంలో కౌలు రైతుల సంక్షేమం కోసం సమగ్రమైన నూతన కౌలుచట్టాన్ని తీసుకురావాలని సీపీఐ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు సీఎం చంద్రబాబును సచివాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఆ పార్టీ నేతలు జల్లి విల్సన్, ముప్పాళ్ల నాగేశ్వరరావు కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందించారు.

రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసి రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధర ప్రకారమే కొనుగోలు చేయాలని, వర్షాలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలకు అందించే పరిహారాన్ని పెంచాలని కోరారు.

ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే అన్నదాత పథకాన్ని సొంతభూమి లేని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు సేవలందిస్తున్న ఆర్డీటీకి విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించిన ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ను కేంద్రం నిలిపేసిందని, దీని పునరుద్ధరణకు చొరవ తీసుకోవాలని కోరారు.

సీపీఐ నేతలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఆర్డీటీ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెల్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Related posts