telugu navyamedia
ఆరోగ్యం

ఆవు పాలు- గేదె పాలలో ఆరోగ్యానికి ఏది మేలు!

పాలు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలలో చాలా పోషకాలు ఉన్నాయి. గ్రామాలలో పాడి జంతువులను బట్టి కొందరు ఆవు పాలు తాగితే మరికొందరు గేదె పాలు తీసుకుంటారు. కానీ ఆవు పాలు లేదా గేదె పాలలో దేనివల్ల ఎక్కువ ప్రయోజనమనే విషయాన్ని తెలుసుకుందాం.

*ఆయుర్వేదంలో ఆవుపాలను ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణిస్తున్నారు.
*ఆవు పాలలోని విటమిన్-బి నరాలను రిలాక్స్ చేసి మంచి నిద్రను అందిస్తాయట. అందుకే, చాలామంది నిద్రకు ముందు పాలు తాగుతారు.
*ఆవు పాలలోని విటమిన్-బి12 జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయట. పిల్లలకు ఈ పాలు మంచివే అంటున్నారు.
*ఆవుపాలలో ప్రోటీన్లతో పాటు, విటమిన్ డి, భాస్వరం, మెగ్నీషియం మెండుగా ఉంటాయట.
*గేదె పాలు కంటే ఆవు పాలలో తక్కువ కొవ్వు ఉంటుంది. ఆవు పాలను తేలికైన పాలు అని కూడా అంటారు. ఆవు పాలు సులభంగా జీర్ణమవుతాయి. అందుచేత ఆవు పాలను పిల్లలకు కూడా ఇస్తారు.


*ఆవు పాలను ఒకటి రెండు రోజుల్లోనే తాగాలి. గేదె పాల విషయానికొస్తే వీటిని మరికొంత కాలం నిల్వ చేసుకోవచ్చు. ఆవు పాలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. గేదె
పాలలో అయితే భాస్వరం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు అధికంగా లభిస్తాయి.
*ఆవు పాలు కంటే గేదె పాలలో ప్రోటీన్లు ఓ పది శాతం ఎక్కువగా లభిస్తాయి. ఆవు పాలలో కొవ్వు కాస్త తక్కువగా లభిస్తుంది. ఆవు పాలలో కొవ్వు మూడు నుంచి నాలుగు
శాతం ఉండగా, గేదె పాలలో 7-8 శాతంతో అధికంగా కొవ్వు ఉంటుంది.
*తక్కువ కొవ్వు ఉండే గేదె పాటు తాగడం ద్వారా మీకు రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి, ఊబకాయం లాంటి సమస్యలు తగ్గుతాయి. ఆవు పాలు తాగడం ద్వారా ఇలాంటి
అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
*శరీర తత్వానికి ఏ పాలు కావాలో మీరు నిర్ణయించుకోండి. గేదె పాలలో ఆవు పాలు కంటే కేలరీలు అధికంగా లభిస్తాయి. ఒక లీటర్​ కప్పు గేదె పాలలో 237 కేలరీలు
లభించగా, అదే ఆవు పాల విషయానికొస్తే 148 కేలరీలు అందుతాయి.


* జీర్ణశక్తి ఎక్కువగా ఉన్నవారు గేదె పాలు తాగవచ్చు. మరీ బలహీనంగా ఉన్నవారు కొవ్వులు, ప్రోటీన్ల కోసం గేదె పాలు తీసుకోవచ్చు. రక్తపోటు, గుండె సంబంధింత
సమస్యలున్న వారు మాత్రం ఆవు పాలు తాగడం ఆరోగ్యకరం.
*ఆయుర్వేదం ప్రకారం ఈ రెండు రకాల పాలు కూడా పిత్త గుణాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల శరీరంలో మంట, దురద వంటివి ఉంటే తగ్గిపోతాయి.
* ఆవు పాలు, గేదె పాలు రెండూ ఎన్నో పోషకాలు నిండినవి. అందుకే ఈ రెండు మన శరీరానికి శక్తిని అందించేందుకు తోడ్పడతాయి.

ఆవు పాలు, గేదె పాలు రెండూ ఆరోగ్యకరమైనవి. ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. అయితే వ్యక్తులు ఎలాంటి పాలను తీసుకుంటే వారికి తట్టుకునే శక్తి ఉంటుందన్న దానిపై ఆధారపడి తాగే పాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే మీ శరీరానికి సరిపడే పాలను ఎంచుకోండి.

Related posts