ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలనీ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ రోజు జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. పిటీషనర్ రాజకీయ దురుద్దేశ్యంతోనే పిటీషన్ దాఖలు చేశారని, పిటీషనర్ తన పిటీషన్లో వాడిన భాష, తీవ్ర అభ్యంతరకరంగా ఉందని పిటీషనర్ రూ.900 కోట్లు బ్యాంకులను మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడని కౌంటర్లో పేర్కోన్నారు. పిటీషనర్ వైసీపీ సభ్యుడిగా ఉండి, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, దీంతో అతడిని అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ కి లెటర్ రాసినట్టు కౌంటర్లో పేర్కోన్నారు. వ్యక్తికీ, ఇన్వెస్ట్గేషన్ ఏజెన్సీ మద్య జరుగుతున్న విచారణలో మూడో వ్యక్తికి సంబందం లేదని, పిటీషనర్ పూర్వాపరాలు దాచిపెట్టి రాజకీయ లబ్ది కోసమే పిటీషన్ వేసినట్టు ప్రతివాది న్యాయవాదులు పేర్కోన్నారు. 2013 లో జగన్కు బెయిల్ వచ్చిన తరువాత ఇప్పటివరకు ఎప్పుడూ కోర్ట్ ఆదేశాలు దిక్కరించలేదని, బెయిల్ కండీషన్స్ అన్ని పాటిస్తూ వస్తున్నట్టు జగన్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఆయితే ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 14 వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
previous post
next post


2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా – డీఎల్