telugu navyamedia
క్రీడలు వార్తలు

భువీ ఇంట్లో కరోనా కలకలం…

టీంఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్.. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి లక్షణాలు కనిపించడంతో అతను ఐసొలేషన్‌లోకి వెళ్లాడు. భువనేశ్వర్ కుమార్‌తో పాటు అతని భార్య నుపుర్ నగర్, తల్లి ఇంద్రేష్‌లోనూ కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీనితో వారంతా ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటోన్నారు. ఇటీవలే భువి తండ్రి కన్నుమూశారు. ఈ ఘటన చోటు చేసుకున్న రెండువారాల్లోపే కుటుంబం మొత్తం వైరస్ బారిన పడటం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. భువనేశ్వర్ కుమార్.. తన కుటుంబంతో కలిసి ఉత్తర ప్రదేశ్‌ మీరట్‌లోని గంగానగర్‌లో నివాసం ఉంటోన్నారు. అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్ కిందటి నెల 20వ తేదీన మరణించారు. కాలేయ వ్యాధితో బాధపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటన చోటు చేసుకున్న 10 రోజుల వ్యవధిలోనే భువనేశ్వర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. అనారోగ్యానికి గురైన అతనికి వైద్య పరీక్షలను నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అనంతరం భార్య నుపుర్ నగర్, తల్లి ఇంద్రేష్‌లకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. భువనేశ్వర్ కుమార్, అతని భార్య ఇంట్లోనే ఐసొలేషన్‌లోకి వెళ్లగా.. తల్లిని మీరట్‌లోని దయావతి కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

Related posts