telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 97,894 మందికి పాజిటివ్

corona covid

దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాల్లో విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 97,894 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 51,18,254కు చేరింది.

దేశంలో గ‌త 24 గంట‌ల సమయంలో 1,290 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 83,198కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 40,25,080 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 10,09,976 మందిచికిత్స పొందుతున్నారు. నిన్నటి వరకు మొత్తం 6,05,65,728 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.

Related posts