హైద్రాబాద్ లోని మలక్ పేట యశోద ఆసుపత్రిలో దారుణం జరిగింది. కరోనా చికిత్స పొందుతున్న బాధితుడు(60) భయంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలోని 503 రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.
నిన్న రాత్రి 2:30 గంటల సమయంలో బాత్ రూమ్‌లోని షవర్‌కి పేషెంట్ వేసుకునే గౌన్‌తోనే ఉరి వేసుకున్నాడు. మృతునికి మరోసారి కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
తన కుటుంబానికి రక్షణ కల్పించకపోతే ఆందోళన: కోడెల