telugu navyamedia
సినిమా వార్తలు

సీఎల్పీ భేటీని బాయికాట్ చేసిన‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..

కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. హైదరాబాద్ తాజ్​దక్కన్‌లో జరుగుతున్న సీఎల్పీ భేటీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాయికాట్ చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో తాజ్ డెక్కన్ లో సమావేశం ప్రారంభమయింది.ఈ సమావేశానికి పీసీసీ మాజీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ నేతలు హాజరయ్యారు.

అయితే సీఎల్పీ సమావేశానికి హాజరయిన జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి వ్యవహారంపై మాట్లాడాలని పట్టుబట్టారు. ఇందుకు మల్లు భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కుసుమకుమార్‌ సూచించినట్టు పేర్కొన్నారు. అందుకే భేటీ నుంచి వెళ్లిపోతున్నట్టు జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదు. ఈ రోజు కూడా తనకు సమాచారం లేకుండా మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారని నాకు ఎదురైన చేదు అనుభవాల గురించి సీఎల్పీ మీటింగ్​లో ప్రస్తావించాలని వచ్చా. పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని నేతలు సూచించారు.

ప్రజా సమస్యలు చర్చించేందుకు ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో పార్టీ అంశాలను ప్రస్తావిస్తే ఎజెండా చెడిపోతుందన్నారు. నాకెదురైన చేదు అనుభవాన్ని చెప్పేందుకు అవకాశం లేనప్పుడు సీఎల్పీ సమావేశంలో ఉండడమెందుకని వెళ్లిపోతున్నాఅని అన్నారు. అంసెంబ్లీకి వెళ్లటం ఎమ్మెల్యేగా నా బాధ్య‌త‌ హక్కు. అసెంబ్లీకి వెళ్తా.. అక్కడ కేసీఆర్​తో కొట్లాడతా అని అన్నారు.

Related posts