గ్రీక్ గాడ్, కండల వీరుడు హృతిక్ రోషన్ త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. బాలీవుడ్‌లో మోస్ట్ స్టైలిష్ హీరో హృతిక్ కు, హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థకు మధ్య చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్ టాక్. దీని కోసం హృతిక్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్‌లో అడుగు పెట్టేందుకు హృతిక్ అమెరికాకు చెందిన గెర్ష్ ఏజెన్సీతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించి హాలీవుడ్‌కు చెందిన ఓ బడా నిర్మాణ సంస్థ ఆయనతో చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చిందని సమాచారం. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుపై హృతిక్ చాలా ఆసక్తి చూపిస్తున్నారట. ప్రస్తుతం ఆయన ఇంటినుంచే అడిషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా ఓకే అయితే ఆయన అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. ఇక హృతిక్ త్వరలో ‘క్రిష్-4’ షూటింగ్ కూడా ప్రారంభించే అవకాశాలున్నాయి.