కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు వెళ్తుండగా.. ఆమె ప్రయాణిస్తున్న పడవలో పెట్రోల్ అయిపోయింది. దీంతో పడవ వాగు మధ్యలో ఓ చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది.
అనంతరం ఈదురు గాలులు, వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో.. వాగుకు ఒకవైపునకు ఒడ్డున ఉన్న ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది. అప్రమత్తమైన అధికారులు సీతక్కను పడవలో నుంచి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు ఏటూరునాగరం మండలం ఎలిశెట్టిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ నెల 12న వరద బాధిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ములుగు జిల్లా పొదుమూరు సమీపంలో గోదావరి వరద ఉద్ధృతి వల్ల కోతకు గురైన భూములను పరిశీలించారు. అలాగే పునరావాస కేంద్రానికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. వారికి పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు



రాష్ర్టాభివృద్ధిని చూసే ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారు: మంత్రి ఎర్రబెల్లి