telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పెళ్లికానుకగా .. నిరోధ్ బహుమతిగా ఇచ్చిన మిత్రుడు..

Marriages

సాధారణంగా మనలో కొందరు ఏదైనా ఫంక్షన్ కో లేక మరేదైనా వివాహ వేడుకకో వెళితే డబ్బులు, లేదా కొంత పెద్ద హోదా గల వారు అయితే నగలు కూడా చదివిస్తుంటారు. ఇక మరికొందరు అయితే తమకు తగ్గ స్థాయిలో గిఫ్టులు కొనుక్కుని తీసుకువెళ్తుంటారు. వాటిలో ఒకింత ఎక్కువగా మనకు గిఫ్ట్ ఆర్టికల్స్ వంటివి బహుమతులుగా వస్తుంటాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఒక యువకుడు తమ స్నేహితుడి వివాహానికి ఒక దిమ్మతిరిగే వస్తువును కానుకగా ఇచ్చాడు. అదే నిరోధ్, కొన్నేళ్ల నుండి ప్రపంచ జనాభా, ముఖ్యంగా మన దేశ జనాభా విపరీతంగా పెరుగుతోందని, ప్రభుత్వం ఎన్నిరకాలుగా ప్రజల్లో జనాభా నియంత్రణపై అవగాహనా కల్పించినప్పటికీ, ఎక్కువ మంది దానిని నిర్లక్ష్యం చేస్తున్నారని, అదే ఇలా వివాహ సమయంలోనే వారికి నిరోధ్ గిఫ్ట్ గా ఇస్తే, ఎప్పటికీ వారికి అది గుర్తుకు వస్తుందని అంటున్నాడు ఆ యువకుడు. అంతేకాక వృత్తి రీత్యా డాక్టర్ కావడంతో, తన స్నేహితుడికి భవిష్యత్తులో ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేస్తానని అతడు చెప్పడం విడ్డూరం.

అతడి బహుమతిని చూసి ఆ పెళ్లి లోని వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. ఈ వింత ఘటన తమిళనాడులోని ఒక పెళ్లి మండపంలో జరిగింది. ఇప్పటివరకు రకరకాల వస్తువులను, డబ్బులు, లేదా బంగారు ఆభరణాలను బహుమతిగా ఇవ్వడం రొటీన్ అయితే, ఇలా నిరోధ్ గిఫ్ట్ గా ఇవ్వడం, అది కూడా నేటి కాలపరిస్థితులను సూచిస్తూ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అతడు చేసిన పనిని కొందరు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది!

Related posts