ఏపీ రాజధాని అమరావతి మహిళల పై సాక్షి మీడియా లో ప్రసారమైన వ్యాఖ్యలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖండించారు.
ఇలాంటి దారుణ వ్యాఖ్యలు హేయమని ఆడ బిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరమని అన్నారు.
బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకయ్య నాయుడు అన్నారు.
అమరావతి ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా, ప్రవృత్తిగా జీవనం సాగిస్తూ భవిష్యత్ తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరుపమానమైనవని, అలాంటి రైతులను, ముఖ్యంగా మహిళా మూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవని వెంకయ్య అన్నారు.
ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు.