అమెరికాలో ఓ 22 ఏళ్ల యువకుడు షాపింగ్‌మాల్లోకి కారుతో దూసుకెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇల్లెనాయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వుడ్‌ఫీల్డ్ షాపింగ్‌మాల్‌లో అందరూ తమ పనుల్లో ఉన్న సమయంలో యువకుడు నల్లకారులో ఒక్కసారిగా మాల్‌లోకి దూసుకొచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. మాల్‌లోని కొందరు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి.. ఏదో దాడి జరగబోతోందని తెలిపారు. మాల్‌లో కాల్పులు కూడా జరిగినట్టు అధికారులకు సమాచారమిచ్చారు. నిమిషాల్లో అక్కడకు చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే మాల్‌ని మూసివేశారు. కాల్పులు కూడా జరిగాయనే సమాచారం రావడంతో.. తనిఖీలు నిర్వహించారు. కారు అద్దాలు పగిలిన చప్పుడు విని చాలా మంది కాల్పులు అనుకుని భయపడినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి హాని జరగలేదని పేర్కొన్నారు. ముగ్గురికి చిన్న చిన్న గాయాలు అయ్యాయని.. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. యువకుడు ఎటువంటి టెర్రరిస్ట్ గ్రూపులకు చెందినవాడు కాదని అధికారులు స్పష్టం చేశారు. కాగా, యువకుడు మాల్‌లోకి రావడానికి గల కారణాన్ని పోలీసులు ఇంకా ప్రకటించలేదు.
ఇండస్ట్రీకి బాలకృష్ణ కింగ్ కాదు , కేవలం హీరోనే… నాగబాబు సంచలన వ్యాఖ్యలు