telugu navyamedia
వార్తలు సామాజిక

పేదల సాయానికి.. కోకా కోలా రూ. 100 కోట్లు!

coca cola

కరోనా వైరస్‌‌ పోరులో భాగంగా సాయమందించేందుకు ప్రముఖ శీతలపానీయాల తయారీ సంస్థ కోకాకోలా కూడా ముందుకొచ్చింది. వంద కోట్ల రూపాయలను ప్రకటించింది. ఈ సొమ్మును ఆరోగ్య సంరక్షణ, పేదల సాయానికి వెచ్చించనున్నట్టు తెలిపింది. అంతేకాదు, 10 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో అవసరమైన పానీయాలను సరఫరా చేస్తామని ప్రకటించింది.

లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు, వలస కూలీలకు ఆహారం, పానీయాలు అందించనున్నట్టు సంస్థ తెలిపింది. కోకాకోలా ఫౌండేషన్, అట్లాంటా మద్దతుతో యునైటెడ్ వే, కేర్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది. భారత్‌లో తాము ప్రారంభించిన ఉపశమన కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Related posts