telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు ఉద్యోగాలు రాజకీయ వార్తలు

మెడికల్ అన్ ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపికబురు

మెడికల్ అన్ ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపికబురు, మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వాలని నిర్ణయం.

విలీనం అనంతరం మెడికల్ అన్ ఫిట్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు ఆదేశాలు జారీ చేసారు.

2020 జనవరి 1 తర్వాత మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు, విలీనానికి ముందు మెడికల్ అన్ ఫిట్ అయిన డ్రైవర్లకు మాత్రమే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు.

ఇకపై డ్రైవర్లు, కండక్టర్లు సహా ఉద్యోగులందరికీ ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు నిర్ణయం, విలీనం తర్వాతా 21 కేటగిరీల్లో మెడికల్ అన్ ఫిట్ వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు నిర్ణయం తీసుకున్నారు.

మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి కండక్టర్, రికార్డు ట్రేసర్ ఉద్యోగాలకు నిర్ణయం. మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి అసిస్టెంట్ మెకానిక్ / శ్రామిక్ ఉద్యోగాలివ్వాలని నిర్ణయం.

ఆర్టీసీలో ఇచ్చే ఉద్యోగానికి అర్హత లేకపోతే ప్రభుత్వ విభాగాల్లో అర్హత ప్రకారం ఉద్యోగాలు. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విభాగాల్లో అర్హత మేరకు ఉద్యోగాలివ్వాలని ఆదేశాలు జారీ చేసారు.

ఏ ఉద్యోగానికీ అర్హత లేనివారికి అదనపు మానిటరీ ప్రయోజనాలు ఇవ్వాలని ఆదేశాలు. మెడికల్ అన్ ఫిట్ వల్ల వాలంటరీ రిటైర్డ్ అవ్వాలనుకునే వారికి అదనపు మానిటరీ ప్రయోజనాలు.

తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీపీటీడీ కమిషనర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసారు. తదుపరి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసారు.

ఈమేరకు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు.

ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరికీ ప్రయోజనాలివ్వడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల హర్షం వ్యక్తం చేసారు.

ఆర్టీసీ ఎన్ ఎంయూఏ నేతలు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts