telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

చైనా యాప్‌లను భారత్ నిషేధించడం శుభపరిణామం: నిక్కీ హేలీ

Nikki Heli

గాల్వన్‌ లోయ వద్ద చైనాతో పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ దేశానికి చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ యాప్ ల నిషేధంపై అమెరికా నుంచి భారత్‌కు మద్దతు పెరుగుతోంది. ఆ యాప్‌లను నిషేధిస్తూ భారత్‌ తీసుకున్న చర్యలపై అమెరికా రాజకీయ వేత్త, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ స్పందించారు.

టిక్‌టాక్‌తో పాటు చైనా సంస్థలకు చెందిన 59 పాప్యులర్ యాప్‌లపై భారత్ నిషేధం విధించడం శుభ పరిణామం అని ఆమె వ్యాఖ్యానించారు. టిక్‌టాక్‌కు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటిగా ఉందన్నారు. చైనా దూకుడుకి ఏ మాత్రం తలొగ్గకుండా భారత్‌ తన చర్యలను కొనసాగిస్తోందని నిక్కీ హేలీ అన్నారు.

Related posts