*నరసరావుపేట సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
*గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అవార్డులు
*ఉత్తమ వాలంటీర్లకు మూడు కేటగిరీల్లో అవార్డులు
*సేవా వజ్ర, సేవా రత్న,సేవా మిత్ర, పేరుతో సత్కారం..
*రాష్ర్టంలో ఉహాకు అందని పాలన కొనసాగుతుంది.
వలంటీర్ల వ్యవస్థ వలన రాష్ట్రంలో అవినీతి లేని పాలన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేట క్రీడా ప్రాంగణం లో నిర్వహించిన వలంటీర్ల సన్మానాసభలో పాల్గొని.. వలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
దేశం మొత్తం మనవైపు చూసేలా రాష్ట్రంలోని వలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రంలో 2లక్షల 60వేలకు మందికి పైగా వలంటీర్లు ఉన్నారని…లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సేవలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు
వివక్ష, లంచం, అవినీతిలకు తావులేకుండా, కులమత రాజకీయాలను పట్టించుకోకుండా ఒక వ్యవస్థ కోసం కల గన్నామని, వలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ కల సాకారమైందని ప్రశంసించారు.
సూర్యుడు ఉదయించక ముందే ప్రతి ఇంటి తలుపుతట్టి వలంటీర్లు ఫించన్లు అందిస్తున్నారని తెలిపారు. వలంటీర్లు అంటే గొప్ప సైనికులు, గొప్ప సేవకులని ప్రశంసలు గుప్పించారు
ఏ పథకమైనా వివక్షకు తావు లేకుండా వలంటీర్లు సేవలు అందిస్తున్నారని అన్నారు. లాభాన్ని పట్టించుకోకుండా.. సేవే పరమావధిగా వలంటీర్లు ముందుకు సాగుతున్నారంటూ అన్నారు. వలంటీర్ వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. .

