telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రతిపక్ష పార్టీలతో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం

సీఎం రేవంత్ రెడ్డి నేడు రాష్ట్ర సచివాలయంలో ప్రతిపక్ష పార్టీలతో కీలక సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి సాయంత్రం 4 గంటలకు విపక్షాలు సమావేశం కావాలని ఆహ్వానించారు.

కొత్త రాష్ట్ర చిహ్నం, గీతం గురించి వారితో చర్చించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి వివరించనున్నారు.

ఈ సమావేశానికి పలు పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.

రాష్ట్ర చిహ్నం, గీతం మార్పులపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సహా పార్టీ నేతలు ఎలాంటి మార్పులు చేస్తే సహించేది లేదని స్పందించారు.

కాగా బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ చారిత్రక కట్టడాలను లోగో నుంచి తొలగిస్తే నిరసన తెలుపుతామని, సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని,  ఆంధ్రాకు చెందిన కీరవాణితో రాష్ట్ర గీతం రూపొందించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది అన్నారు.

లోగో మార్పులపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ తెలిపారు.

అధికారిక చిహ్నాన్ని మార్చడం సాధ్యం కాదు.. కేంద్రం ఆమోదం పొందాలి అని తెలిపారు.

Related posts