telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్, భట్టి

తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి అవరతణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

దశాబ్ధి అవతరణ ఉత్సవాలు కావడంతో.. వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆహ్వానాలను పంపుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క శనివారం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి రేపు జూన్ 2న జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారు.

ఆయనకు పుష్పగుచ్చం అందించారు.

మరోవైపు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ కూడా వస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో వివిధ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల కోసం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.

Related posts