ఈ ఘటన బీజింగ్ లో జరిగింది. 15 రోజులుగా తన ముక్కు నుండి విపరీతంగా రక్తస్రావం జరుగుతోందంటూ ఓ వ్యక్తి ఆస్పత్రికి చేరుకున్నాడు. పేషెంట్ మాటలు విన్న వైద్యుడు.. అతన్ని పరిశీలించగా పేషెంట్ ముక్కులో ఏదో డాక్టర్ కంటపడింది. దాంతో అతని ముక్కులో మత్తుమందు జల్లి, లోపల ఉన్న పురుగును బయటకు తీశాడు. తీరాచూస్తే అది మూడున్నర అంగుళాల జలగ. దాన్ని చూసిన డాక్టరు షాకయ్యాడు. అంత పెద్ద జలగ ముక్కులోకి వెళ్తుంటే ఏం చేస్తున్నాడంటే… చైనాకు చెందిన ఆ వ్యక్తి కొన్ని రోజుల క్రితం హైకింగ్ చేయడం కోసం ఓ కొండ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఓ నదిలో నీటిని తాగాడు. అలా తాగేప్పుడు ఓ జలగ లార్వా అతని ముక్కులో ప్రవేశించింది. రెండు వారాల పాటు అతని రక్తం తాగుతూ అతని ముక్కులోనే పెరిగి పెద్దదయింది.