telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు విద్యా వార్తలు

ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకోమంటున్న ప్రభుత్వం.. దారిచూపిస్తూ ..

bjp

కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు కొత్తదారులు చూపుతుంది. ఎలాగూ అన్నిటిని ప్రైవేట్ పరం చేస్తుపోతూ, ఉద్యోగాలు కూడా అదే బాటలో చూసుకోమంటుంది. అందుకు దారి కూడా చూపిస్తూ, అదే ఉన్న దారి అంటూ సంకేతాలు ఇస్తుంది. ప్రభుత్వ రంగాన్ని సరిచేయలేని ఈ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేసి, వారి ప్రభుత్వం కూడా చేతకానిదానే సంకేతాలు కూడా ఇస్తున్నారని తెలుసుకోలేకుండా ఉందా .. అని నిపుణులు విమర్శిస్తున్నారు. ఇక దేశంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న వారి నుంచి.. మొదలు.. బీటెక్, ఎంటెక్ చేసిన విద్యార్ధుల వరకు ఉద్యోగాలు ఉన్నాయని .. దీంతోపాటు ఆయా రాష్ట్రాల పరిధిలో ఉండే ఉద్యోగాల వివరాలు తెలుసుకోవడానికి జాబ్‍ సీకర్స్ అనే ఆప్షన్‍ కింది వివరాలను చూసుకునే వీలుందని, పోర్టల్‍లో వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థుల ఫోన్‍లకు.. ఉద్యోగాల వివరాలు పంపడంతోపాటు వారి పరిధిలోని ఎంప్లాయిమెంట్‍ ఎక్స్‌ఛేంజ్ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‍మేళాల వివరాలను కూడా పంపనున్నారని చెప్పుకొస్తుంది ఈ ప్రభుత్వం.

నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు ముందుగా https://www.ncs.gov.in/ వెబ్‍సైట్‍లో లాగిన్‍ అయి ఏయే ఉద్యోగాలకు అర్హత ఉన్నారో.. పోర్టల్‍లో నమోదు చేయాలి. మీ వివరాలు నమోదు చేయగానే 19 డిజిట్‍ గల యూజర్‍ ఐడీ వస్తుంది. దీనితో ప్రతిసారి లాగిన్‍ అయ్యి.. ఎక్కడ ఏమేం ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయో, కొత్తగా ఏమైనా ఉద్యోగాలు వచ్చాయో చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ పోర్టల్‌లో 1.06 కోట్ల మందికి పైగా నిరుద్యోగులు.. ఉద్యోగాల కోసం వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం 2.91 లక్షల కొలువులు వివిధ కంపెనీల్లో ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన సమాచారం కోసం 18004251514 టోల్‍ఫ్రీ నంబర్‍ కూడా అందుబాటులో ఉంది. ఇది ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు పనిచేస్తోంది. నిరుద్యోగులరా .. మీ చావు మీరు చావండి అంటూ ఈ చేతులెత్తేసిన ప్రభుత్వం చూపిన దారి నచ్చిందనుకుంటే.. ఫాలో అయిపోండి మరి. తప్పదు, మీలాంటి చేతకాని వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వమే కదా మరి!!

Related posts