యాదాద్రి: తెలంగాణ రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ రోగ పీడితులను ఆదుకుంటూ వారి పాలిట వరంగా మారింది. పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ ఎస్ ప్రభుత్వం పని చేస్తోంది.
ఈ క్రమంలోనే యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ఇద్దరు రోగ పీడితులు తమను ఆదుకోవాలని కోరగా, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రత్యేక చొరవతో ఇద్దరు లబ్దిదారులకు సీఎంరిలీఫ్ ఫండ్ మంజూరైంది. మంజూరైన సీఎంఆర్ ఫండ్ చెక్కులను మాసాయిపేట గ్రామానికి చెందిన లబ్దిదారులు మొహమ్మద్ అమినాభికి 1 లక్షరూపాయలు, బాబుకి 62 వేల 500 రూపాయల చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాసాయిపేట గ్రామశాఖ అధ్యక్షులు గుణగంటి బాబు రావు గౌడ్,
సర్పంచ్ వంటేరు సువర్ణ ఇంద్రారెడ్డి,ఉప సర్పంచ్ వాకిటి అమృత కిష్టయ్య నాయకులు గిరెడ్డి నర్సింహ రెడ్డి,పాండు, బండ భాస్కర్, సగ్గు నర్సింహులు, తాడూరి నర్సింహులు,ఇదెయ్య, కోల రాములు తదితరులు పాల్గొన్నారు.