ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రిలో పర్యటించనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్షీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అద్భుతంగా పునర్‌నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
ఈ క్రమంలో కేసీఆర్ మరోసారి యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. మార్చి 28వ తేదీన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో పనుల పురోగతిని సీఎం కేసీఆర్ మరోసారి స్వయంగా పరిశీలిస్తారు. కొండపైన, కింద అభివృద్ధి పనులు చేపట్టారు. అవన్నీ దాదాపు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల ఫినిషింగ్ టచ్‌లో ఉన్నాయి. మార్చి 21వ తేదీ నుంచి మహాసుదర్శనయాగం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం, ఆలయ ప్రధాన గోపురానికి బంగారు తాపడం పనులు, ఇతర ఏర్పాట్లను అధికారులతో సమీక్షించనున్నారు.
సుదర్శన యాగంలో 1108 యజ్ఞగుండాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో యజ్ఞగుండానికి కనీసం ఆరుగురు చొప్పున దాదాపు 6 వేల పైచిలుకు రుత్వికుల పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, యోగులు, స్వామీజీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
అలాగే.. ప్రధాన ఆలయ ముఖద్వారం, ధ్వజస్థంభం, బలిపీఠాలకు బంగారు తాపడం పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.