*ఆరో రోజు ఘనంగా రామానుజ సహస్రాబ్ది వేడుకులు
*నేడు హైదరాబాద్‌కు వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
*శ్రీ రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేడు (సోమవారం) హైదరాబాద్ వెళ్లనున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి వేడుకల ప్రాంతానికి వెళ్తారు. శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. తిరిగి రాత్రి 9.05 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారు.
కాగా..సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఆరో రోజు కన్నులు పండుగగా కొనసాగుతున్నాయి. మొదటగా దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టి యాగం నిర్వహిస్తారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ చేస్తారు. వీటితో పాటు ప్రముఖులతో ప్రవచనాలు, విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
పరారీలో ఉండాల్సిన అవసరం మా ఆయనకు లేదు: అఖిలప్రియ