మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. పి.వి.నరసింహా రావు వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో పి.వి.నరసింహా రావు ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారత దేశం అనుభవిస్తున్నదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అంతర్గత భద్రత వ్యవహారాల్లోనూ, విదేశాంగ వ్యవహారాల్లోనూ పి.వి.నరసింహారావు అవలంభించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమాత్వాన్ని పటిష్ఠపరిచిందని సిఎం కొనియాడారు. బహు భాషా వేత్తగా, బహు ముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పి.వి.కి ఘనమైన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు. ఇది ఇలా ఉండగా.. పీవీ నర్సింహ రావు 16 వ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద పూల మాల వేసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్,మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు కేకే,పీవీ కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు.
previous post
సగం గోచీ నువ్వే విప్పుకున్నావ్… నరేష్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు