telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

గుడ్‌ న్యూస్ : వాట్సప్‌ నుంచి అదిరిపోయే కొత్త ఫీచర్‌

whatsapp

లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. దీని వల్ల వీడియో కాల్స్‌, గ్రూప్ కాల్స్‌, వీడియో కాన్ఫరెన్స్‌ లాంటి విపరీతంగా పెరిగిపోయాయి. సరిగ్గా అదే సమయంలో జూమ్‌ యాప్‌, గూగుల్‌ మీట్‌ లాంటి వాటికి ఒక్కసారిగి డిమాండ్‌ పెరిగిపోయింది. ఇప్పటికీ వీటికి ఏ మాత్రం డిమాండ్‌ తగ్గలేదు. అయితే.. తాజాగా వాట్సాప్‌ ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక నుంచి వాట్సప్‌ కూడా డెస్క్‌టాప్‌ ద్వారా వీడియో కాల్స్‌, గ్రూప్‌ కాల్స్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందు కోసం కొత్త ఫీచర్‌ ను తీసుకొచ్చింది. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లో వాట్సప్‌ వెబ్‌ ఉపయోగించేవారికి ఈ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది. వాట్సప్‌ డెస్క్‌టాప్‌ ద్వారా చేసే వీడియో కాల్స్‌, వాయిస్‌ కాల్స్‌కి కూడా ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌ క్రిప్షన్‌ ఉంటుందని వాట్సప్‌ ప్రకటించింది. అయితే.. డెస్క్‌ టాప్‌లో వాట్సప్‌ కాలింగ్‌ ఫీచర్‌ వాడుకోవాలంటే విండోస్‌ 10 64-బిట్‌ వెర్షన్‌ 1903 లేదా అంతకన్నా కొత్తది ఉండాలి. macOS 10.13 లేదా అంతకన్నా లేటెస్ట్‌ వర్షన్‌ ఉండాలి. వీటితో పాటు యాక్టీవ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి.

Related posts