కొల్హాపూర్: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కొల్హాపూర్ వెళ్లిన కేసీఆర్ కుటుంబం.. అక్కడ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు మర్యాదగా స్వాగతం పలికారు.
మధ్యాహ్నం అమ్మవారికి చేపట్టే హారతి కార్యక్రమంలో కేసీఆర్ సతీసమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు అందజేసిన తీర్థప్రసాదాలను స్వీకరించారు.

దర్శనానంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..చాలా రోజుల నుంచి నేను ఈ గుడికి వద్దామని.. అమ్మ ఆశీస్సులు తీసుకుందామని అనుకుంటున్నాను..కానీ ఇప్పటికి కుదిరింది. దేశం అభివృద్ధి పథంలో సాగాలని.. రైతులు ఆనందంగా ఉండాలని.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మను కోరుకున్నాను అంటూ చెప్పారు.


ప్రయివేట్ సంస్థలు కోట్లు గడిస్తుంటే… ఆర్టీసీ మాత్రం నష్టాల్లో: లక్ష్మణ్