సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు జూన్ 1కి వాయిదా పడింది. అయితే జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రఘురామ పిటీషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని జగన్కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అయితే లాక్డౌన్ తదితర కారణాల వలన కౌంటర్ దాఖలు చేయలేకపోయినట్టు జగన్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. సీబీఐ నుంచి తమకు ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే పలుమార్లు అవకాశం ఇచ్చిన సీబీఐ కోర్టు మరోసారి అవకాశం ఇచ్చింది. జూన్ 1 వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని, 1 వ తేదీన కౌంటర్ దాఖలు చేయకుంటే నేరుగా విచారణ చేపడతామని హెచ్చరించింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post


పార్టీ పిరాయింపులపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు