telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సికింద్రాబాద్‌ లో సెల్ఫ్ లాక్ డౌన్.. నేటి నుంచి బట్టల షాపుల బంద్

cloth stores

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌‌లోని వస్త్ర వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి వచ్చే నెల 5 వరకు దుకాణాలను స్వచ్ఛందంగా మూసి వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సికింద్రాబాద్ చేనేత, సిల్కు, వస్త్ర దుకాణదారుల సంఘం అధ్యక్షుడు టి.అశోక్ కుమార్ తెలిపారు. నగరంలో కరోనా వైరస్ వ్యాప్తికి తాము కారణం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

మరోవైపు, సికింద్రాబాద్‌ జనరల్ బజార్‌లోని నగల వ్యాపారులు కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు. ఆయా ప్రాంతాల్లోని దుకాణాలను మూసివేస్తున్నారు. అదేవిధంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హోల్‌సేల్ దుకాణదారులు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్లన్నీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అమ్మకాలు కొనసాగించినట్టు హైదరాబాద్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్ వ్యాస్ తెలిపారు.

Related posts