ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్ లోని మొత్తం 80 స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుని ఘోర ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో ప్రక్షాళన కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేవలం తూర్పు యూపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీకి తాజాగా యూపీకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
యూపీలో కాంగ్రెస్ ఘోర వైఫల్యంపై ప్రియాంక గాధీ, వెస్ట్ యూపీ ఇన్‌చార్జి జ్యోతిరాదిత్య సింధియా పలుమార్లు సమీక్షా సమావేశాలు జరిపారు. అనంతరం పార్టీ యూపీ విభాగంలో భారీ మార్పులు తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగాపాల్ ప్రకటించారు.యూపీలోని 12 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఉపఎన్నికలు జరుగనుండంతో పార్టీని పునరుద్ధరించాలనే పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది.