మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై సింగర్ చిన్మయి శ్రీపాద పోరాడుతున్న విషయం తెలిసిందే. ఎక్కడైనా మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయని తెలిస్తే బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు చిన్మయి. ఇప్పటికే ప్రముఖ తమిళ లిరిసిస్ట్ పై సంచలన ఆరోపణలు చేసినందుకు ఇప్పటికీ విమర్శలను ఎదుర్కొంటోంది చిన్మయి. అయితే పోలీసులపై వచ్చిన ఓ ఫేక్ పోస్ట్ పై స్పందించి, నిందారోపణలు చేసిన గాయని చిన్మయి, ఆ తరువాత అసలు విషయం తెలియడంతో నాలిక్కరుచుకుంది. వివరాల్లోకి వెళ్తే… యూపీకి చెందిన ఓ అధికారి, తనవద్దకు వచ్చిన అత్యాచార బాధితురాలిని, కోరిక తీర్చమని అడిగాడట. ఆ పోస్ట్ ను చూసిన చిన్మయి, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసే ఇలా ప్రవర్తిస్తే ఎలా? అంటూ మండిపడ్డారు. ఈ ట్వీట్ కాస్తా వైరల్ కావడంతో యూపీ పోలీసులు స్పందించారు. ఇది ఎప్పుడో 2017లో జరిగిన ఘటనని, మూడేళ్ల తరువాత ఓ సెలబ్రిటీ గుర్తు చేయడం ఆమె బాధ్యతారాహిత్యమని అన్నారు. ఇది ఫేక్ న్యూస్ అని, అప్పట్లో ఎస్ఐపై విచారణ జరుపగా, అది అబద్ధమని తేలిందని స్పష్టం చేశారు. ఆమెపై అత్యాచారమే జరగలేదని చెబుతూ రీట్వీట్ చేశారు. దీన్ని చూసిన చిన్మయి తనను గుర్తించినందుకు ధన్యవాదాలని, ఈ తరహా ఘటనలు తనకు తెలిస్తే, సోషల్ మీడియాలో పెడుతుంటానని, బాధితులకు న్యాయం జరగాలన్నదే తన ఉద్దేశమని చెబుతూ తనను క్షమించాలని పోలీసులను కోరింది.
previous post


జెమినీ గణేషన్ కు జమున వార్నింగ్… సంచలన వ్యాఖ్యలు