టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య , సమంత తొలిసారి ఏ మాయ చేశావే చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వీరిద్దరి పర్‌ఫార్మెన్స్‌కి మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు ఇద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగుందని అన్నారు. ఈ చిత్రం తర్వాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాలలో కలిసి నటించారు చైతూ, సామ్. నాలుగు సార్లు జోడీ కట్టిన సమంత, నాగ చైతన్య జంట ఐదోసారి కలిసి కనువిందు చేసేందుకు సిద్దమైనట్టు తెలుస్తుంది. నాగ చైతన్య ప్రస్తుతం తన 20వ చిత్రాన్ని గీతా గోవిందం చిత్రంతో హిట్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిన పరశురాం దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇటీవలే అఫీషియల్ ప్రకటన వచ్చింది. ఇందులో సమంతని కథానాయికగా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. జనవరి నుండి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి. అయితే వివాహం తర్వాత నాగచైతన్య సినిమాల విషయంలో ఆయన భార్య, అగ్ర కథానాయిక సమంత చాలా శ్రద్ధ పెడుతోందని ఇటీవలి కాలంలో వార్తలు వస్తున్నాయి. షూటింగ్‌కు ముందు కథ వింటుందని, షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమా చూసి పలు సూచనలు ఇస్తుందట. సమంత ప్రస్తుతం 96 రీమేక్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు 96 రీమేక్ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు “ది ఫ్యామిలీ మ్యాన్” సీజన్ 2 వెబ్ సిరీస్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్ నుంచి ఆఫర్ రాగా, దానిని సున్నితంగా తిరస్కరించిందట.
previous post
next post