ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణ కరకట్ట పక్కనే చంద్రబాబు నివాసం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని ప్రతిపక్ష నేత నివాసానికి అనుబంధంగా గుర్తించాలని వినతి చేశారు.
పార్టీ అధినేతగా తనను కలిసేందుకు అనేకమంది వస్తుంటారని అందువల్ల ఈ భవనాన్ని తమకే కేటాయించాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు లేఖలో పేర్కొన్న విషయం పై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి మరి.