ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 2,3 తేదీల్లో నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తనను వరుసగా కుప్పం నియోజకవర్గం నుంచి మ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలను, పార్టీ కార్యకర్తలను, అభిమానులను కలిసి ధన్యవాదాలు చెప్పడానికి ఈ పర్యటన చేపట్టనున్నారు.
ఈ మేరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని గ్రామాల్లో బాబు పర్యటించనున్నారు. ఖచ్చితమైన కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. ఖచ్చితమైన కార్యక్రమాలను సోమవారం సాయంత్రానికి ఖరారు చేసే అవకాశం ఉంది. చంద్రబాబు కుప్పం పర్యటన వివరాలను ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ మీడియాకు వివరించారు.


మూడు రాజధానులపై బొత్స ఆసక్తికరవ్యాఖ్యలు..