telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మద్యం దుకాణాలు తెరవడం పెద్ద తప్పిదం: చంద్రబాబు

chandrababu

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవడం పెద్ద తప్పిదమని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు.వచ్చే రెండు నెలలు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పెరుగుతాయనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.

ఏపీలో మొదట్లో క్వారంటైన్ సక్రమంగా అమలు చేయలేకపోయారని విమర్శించారు. లాక్ డౌన్ ద్వారా మహమ్మారిని అరికట్టగలిగారని, అయితే, నిబంధనల అమలులో కొన్ని రాష్ట్రాల్లో పొరపాట్లు జరిగాయని విమర్శించారు. ఏపీలో విద్యుత్ బిల్లులు నాలుగు రెట్లు పెంచడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. తాము వ్యవస్థలను నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని అన్నారు. పాలకులు అసమర్థులు అయితే ప్రజలు నష్టపోతారని విమర్శించారు.

Related posts