telugu navyamedia
రాజకీయ

యూపీలో అధికారం దిశ‌గా బీజేపీ ..

*యూపీలో బీజేపీ హ‌వా..
*మ్యాజిక్ ఫిగ‌ర్ దాటిన బీజేపీ ఆధిక్యం..
*వ‌రుసుగా రెండోసారి బీజేపీ అధికారం..
*యూపీలో యోగీ మాయాజ‌లం..
*గ‌త 30ఏళ్ళ యూపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో రీకార్డును తిర‌గ‌రాసిన బీజేపీ
*కాసేప‌ట్లో బీజేపీ అఫీస్‌కు ప్ర‌ధాని మోదీ , అమిత్ షా..

దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాలలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది.

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పైనే అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో యూపీలో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈ సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ‌గా దూసుకుపోతుంది. అందుకు అనుగుణంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి.

యూపీలో మొత్తం 403 మంది సభ్యులతో కూడిన యూపీ అసెంబ్లీలో.. మ్యాజిక్ ఫిగర్ 202 స్థానాలు. అధికార బీజేపీ 270 స్థానాల్లో అధిక్యంతో భారీ మెజార్టీ దిశగా దుసుకుపోతోంది. దీంతో బీజేపీ వ‌రుసగా రెండోసారి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తుంది.

గోరఖ్‌పూర్‌ అర్బన్‌ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారి యోగి ఆదిత్యానాథ్‌ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు.ఈ క్ర‌మంలో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ఆ రాష్ట్ర సీఎం కానున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు యూపీ అధికార పీఠం అందని ద్రాక్షే అయ్యింది.

Related posts