telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్ర‌బాబు

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నేడు  తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా బాల‌య్య‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలి అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు పెట్టారు.

“తెలుగు సినీ నటులు, హిందూపురం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నంద‌మూరి బాల‌కృష్ణ‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

వెండి తెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను పొందిన మీరు నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను” అని చంద్ర‌బాబు త‌న సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.

ఇక‌, దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో బాలకృష్ణ 100కు పైగా చిత్రాల్లో నటించారు. పౌరాణిక, జానపద, సాంఘిక, మాస్ యాక్షన్ వంటి విభిన్న జానర్లలో సినిమాలు చేసి మెప్పించారు.

“సమరసింహారెడ్డి”, “నరసింహనాయుడు”, “అఖండ” వంటి చిత్రాల్లో ఆయన నటన, పాత్రలు అశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఆయనను మాస్ హీరోగా నిలబెట్టాయి.

వెండితెరపైనే కాకుండా రాజకీయాల్లో కూడా బాలకృష్ణ తనదైన ముద్ర వేశారు. తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజాసేవలో చురుగ్గా పాల్గొంటున్నారు.

కళారంగానికి, ప్రజాసేవకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇటీవలే భారత ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన విష‌యం తెలిసిందే.

సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ అభిమానులు ప్రత్యేక పోస్టులు, ఫ్యాన్ మేడ్ వీడియోలతో తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

“లెజెండ్” అంటూ ఆయనను కీర్తిస్తూ, ఆయన పట్ల తమకున్న అచంచలమైన అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఈ ప్రత్యేకమైన రోజున, నందమూరి బాలకృష్ణ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, మరిన్ని విజయాలు సాధించాలని తెలుగు సినీ పరిశ్రమ, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related posts