telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

నేడు శ్రీశైలంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు, కృష్ణమ్మకు జలహారతి సమర్పించి, ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో రాయలసీమ అభివృద్ధికి తన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు.

ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడానికి ముందు శ్రీశైల మల్లన్నకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాయలసీమను రతనాల సీమగా మార్చాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

మల్లన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

“నా జీవితంలో ఇది అత్యంత సంతోషకరమైన రోజు. జులై మొదటి వారంలోనే శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారడం శుభపరిణామం.

జలాలే మన నిజమైన సంపద, సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు.

వాటితోనే రైతుల కష్టాలు తీరతాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 200 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది” అని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

గతంలో రాయలసీమను ఎవరూ కాపాడలేరని చాలామంది అన్నారని, కానీ స్వర్గీయ ఎన్టీఆర్ ఆ పరిస్థితిని మార్చేందుకు నడుం బిగించారని గుర్తుచేశారు.

Related posts