telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు వార్తలు

డీఆర్‌డీఓ డ్రోన్ ద్వారా మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

కర్నూలులోని టెస్టింగ్‌ రేంజ్‌లో డీఆర్‌డీఓ డ్రోన్ ద్వారా మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

మన దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి దోహదపడటం ఆంధ్రప్రదేశ్ కు గర్వంగా ఉందని చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR)లో UAV-లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (ULPGM-V3) పరీక్ష విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు అభినందనలు తెలిపారు.

మన దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని చంద్రబాబు అభివర్ణించారు.

ULPGM-V3 విజయం ఆత్మనిర్భర్ భారత్ నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని చంద్రబాబు అన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ట్వీట్ కు ప్రతిస్పందనగా చంద్రబాబు ఈ సందేశమిచ్చారు.

ఇలా ఉండగా, భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) మరో విజయాన్ని అందుకుంది. డ్రోన్ ద్వారా ప్రిసిషన్ గైడెడ్ మిసైల్‌-వీ3ని (యూఎల్‌పీజీఎమ్) విజయవంతంగా ప్రయోగించింది.

కర్నూల్‌లోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్‌‌లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగంలో డీఆర్‌డీఓతో పాటు రక్షణ రంగానికి చెందిన పలు సంస్థలు పాల్గొన్నాయి.

పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. స్వదేశీ రక్షణ రంగ సామర్థ్యాల అభివృద్ధికి ఈ ప్రయోగం గొప్ప ప్రోత్సాహకమని వ్యాఖ్యానించారు.

Related posts