తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ముఖేశ్ గౌడ్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విచారం వ్యక్తంచేశారు. ముఖేశ్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ట్వీట్ చేశారు. తన మూడు దశాబ్దాల రాజకీయ ప్రజా ప్రస్థానంలో బీసీల అభివృద్ధి కోసం ముఖేశ్ గౌడ్ ఎంతగానో కృషిచేశారని తెలిపారు. ముఖేశ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
previous post


వైసీపీ ప్రభుత్వానికి ఆత్రమే తప్ప శ్రద్ధ కొరవడింది: కన్నా